కొన్ని రోజులుగా ఓ ఇంటిపై రెక్కీ నిర్వహించిన దుండగులు దారుణం చేశారు… తమిళనాడులో దారుణం జరిగింది, ధనరాజ్ అనే బంగారు వ్యాపారి ఇంటిలో బంగారం భారీగా ఉంటుంది అని తెలుసుకున్న దుండగులు అతని ఇంటిపై రెక్కి నిర్వహించారు.. చివరకు ఇంటిలో అతని భార్య కుమారుడు ఉన్న సమయంలో ఇంటిలోకి వెళ్లి వారిని చంపేసి దాదాపు 17 కిలోల బంగారం ఎత్తుకువెళ్లారు.
ఇక పోలీసులు వెంటనే ఈ హంతకులని పట్టుకున్నారు.. మొత్తం ఈ గ్యాంగులో నలుగురు ఉన్నారు, తెలివిగా బంగారు వ్యాపారి ఇంటిలోని సీసీటీవీ హార్డ్డిస్క్లను కూడా నిందితులు తీసుకువెళ్లారు… అయితే వీరిలో ఒకరిని ఎన్ కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది మిగిలిన ముగ్గురు దొరికారు పోలీసులకి.
ఇక వీరి దగ్గర ఆయుదాలు ఉన్నట్లు తెలుస్తోంది, ఇక బంగారు వ్యాపారి స్ధానికంగా బాగా పేరు ఉన్న వ్యక్తి. అతని దగ్గర భారీగా నగదు బంగారం ఇంటిలో ఉంటుంది అని ఆలోచించి చివరకు ఇంత దారుణం చేశారు,
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి.