బంగారం బిజినెస్ కు ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? దాని చరిత్ర కారణాలు

-

నిజమే మన దేశ ఆర్ధిక రాజధాని ముంబై.. అంతేకాదు బంగారం అమ్మకాలు కూడా మన దేశంలో ఎక్కువ జరిగేది అక్కడ నుంచే.. దేశంలో అన్నీ ప్రాంతాలకు బంగారం అక్కడ నుంచి ఎగుమతి అవుతుంది, అయితే మరి మన ఏపీలో ప్రొద్దుటూరుని బులియన్ ముంబై అంటారు, బంగారానికి ఇక్కడ కేరాఫ్ అడ్రస్ అంటారు, మంచి నాణ్యమైన బంగారం ఉంటుంది అంటారు.

- Advertisement -

వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడకు వచ్చి బంగారం కొనుగోలు చేస్తారు.. దానికి కారణాలు చూస్తే.
1979లో కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న బంగారంలో కొంత భాగం వేలం వేసింది. ఆర్బీఐ ద్వారా టెండర్లలో బంగారం అమ్మకాలు జరిపింది. కచ్చితంగా బ్యాంకుల ద్వారా నగదు ఇచ్చి బంగారం కొనాలి, దేశంలో ఎవరూ కొనలేదు ఏకంగా పొద్దుటూరు వాళ్లే కొన్నారు, ఇక్కడ వ్యాపారులు భారీగా ఆ బంగారం కొనుగోలు చేశారు.

కేంద్రం వేలం వేసిన బంగారంలో 70 శాతం ప్రొద్దుటూరు వ్యాపారులు కొనుగోలు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా ఇప్పటికీ ఈ విషయం చెప్పుకుంటారు, ఇక్కడ వ్యాపారులు అందరికి లైసెన్స్ ఉంది. స్వాతంత్య్రం రాకముందు నుంచి ఇక్కడ ఇలా బంగారం వ్యాపారం చేస్తున్నారు.

నాణ్యమైన బంగారం అమ్మడంతో పాటుగా ధరల విషయంలో కూడా ప్రొద్దుటూరు అందుబాటులో ఉండటంతో అనేక మంది ఇక్కడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతూ వచ్చారు. ఇక్కడ అమ్మవారి శాల వీధిగా పిలుస్తున్న ప్రాంతమంతా పూర్తిగా బంగారం దుకాణాలే కనిపిస్తాయి. ఇక్కడ ఏ డిజైన్లు అయినా తయారు చేస్తారు, ఇక్కడ నుంచి ముంబైకి డిజైన్లు వెళతాయి అంటే అర్ధం చేసుకోవచ్చు, ఇక్కడ చాలా కుటుంబాలు గతంలో మయన్మార్ ముంబై నుంచి వచ్చి ఉండేవారు, వారువ్యాపారం భారీగా చేసేవారు, అలా ఇక్కడ బంగారం అమ్మకాలు కొనుగోళ్లు ఎక్కువ జరిగేవట. ప్రొద్దుటూరులో కేవలం ఈ వృత్తి మీద ఆధారపడి 6,000 మంది జీవిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...