ముంబై సిటీ ధారావిలో ప్రస్తుతం ఎన్ని కరోనా కేసులంటే

-

మహారాష్ట్ర కరోనా కేసులు మన దేశంలో అత్యధికంగా ఇక్కడ నమోదు అయ్యాయి, ముంబైలో భారీగా కేసులు వెలుగులోకి వచ్చాయి, ఇప్పుడు ముంబైలో కాస్త సాధారణ పరిస్దితి ఉంది. కేసులు తగ్గుముఖం పట్టాయి, అయితే ముంబై సిటీలో ధారవి అనే మురికివాడ పేరు తెలియనివారుండరు, ఇక్కడ కూడా కరోనా కేసులు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.

- Advertisement -

ఆసియాలో అత్యంత పెద్ద మురికివాడగా ధారవికి పేరుంది.. ఇక్కడ వేలాది కేసులు నమోదు అవుతాయి అని అందరూ ఆందోళన చెందారు ..ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది, అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఏప్రిల్ నుంచి భారీగా ఇక్కడ కేసులు వచ్చినా ఇప్పుడు ధారావి కోలుకుంది. కొత్తగా కేసులు నమోదు కాలేదు.

ధారవిలో కరోనా కట్టడి కోసం.. ఆరోగ్య కార్యకర్తలు, పరిశోధన ఔత్సాహికులు కీలకపాత్ర పోషించారు.
ఇక్కడ ఎవరికి అయినా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి పరీక్షలు చేశారు, ఆస్పత్రులకి పంపారు, జనాలు బాగా జాగ్రత్తలు తీసుకున్నారు.. దీంతో దారావి కేసులు తగ్గుముఖం పట్టాయి.ప్రస్తుతం 12 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. 3,464 మంది కరోనా వైరస్ నుంచి రోగులు కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...