హైదరాబాద్లో బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ మరో ఇద్దరితో కలిసి అఘాయిత్యానికి ప్రయత్నించాడు, ఆమెని వేరే ఆటోలో మరో ఇద్దరితో కలిసి తీసుకువెళుతున్న సమయంలో ఆమె తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది….వెంటనే అలెర్ట్ అయిన బాధితురాలి తల్లి తమ సమీప బంధువైన ఓ అబ్బాయికి ఫోన్ చేసింది.. అతను వెంటనే డయల్ 100 కి కాల్ చేశాడు ఇక వెంటనే అక్కడ కీసర, ఘట్కేసర్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆమె నెంబర్ కి ఫోన్ సిగ్నల్స్ చూశారు..
మొత్తం ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా చూశారు,ఈ సమయంలో ఘట్కేసర్ సర్వీసు రోడ్డుకు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం దగ్గర చూపింది. పోలీసులు అక్కడకు చేరుకున్నారు.. వెంటనే ఆమెని కాపాడారు.. అయితే నిందితులు పారిపోయారు,.. ఇక ఆటో డ్రైవర్ తో ఆమెకు జరిగిన పెనుగులాటతో బాధితురాలి కుడికాలికి గాయమైంది.
రాత్రి 7:50 గంటల ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు, ఇక ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు.