శరన్నవరాత్రులు మొదలయ్యాయి, అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు అందరూ, ఎంతో నిష్టంగా ఈ
శరన్నవరాత్రుల పూజలు చేస్తారు, కచ్చితంగా పూజాసామగ్రి, పూజాద్రవ్యాలు, హోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి.
పూజామందిరంలో 9 అంగుళాలు ఎత్తుగల పీఠాన్ని ఏర్పరచుకొని, పీఠముపై ఎర్రని వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై సువర్ణ, రజిత, లేదా తామ్రా కలశమును ఉంచి, కలశమునకు దారములు చుట్టాలి
అంతేకాదు కలశములో మంచి శుద్దనీరు తీసుకోవాలి, ఇందులో సుగంధ ద్రవ్యాలు వేయాలి, వీలైతే నవరత్నాలుఉంటే వేసుకోవచ్చు పసుపు, కుంకుమ, చందనం, మామిడి ఆకులు కట్టాలి. దీనిని 10 రోజులు ఇలా ఉంచితే ఇంటిలో శుభాలు కలుగుతాయి.
అంతేకాదు ఉదయం ఇంటిలో సభ్యులు అందరూ తలారా స్నానం ఆచరించాలి.. అంతేకాదు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో మంచిది, అలాగే రాత్రి ఉపవాశం ఉండి ఉదయం 5 గంటలక నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి, ఎర్రటి వస్త్రాలు పసుపు వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్లవచ్చు. పరుషమైన మాటలు, అమంగళకరమైన వాక్యాలు పలుకకూడదు.