డబ్బు నోట్లకు ఇచ్చే విలువ మనం దేనికి ఇవ్వం అనేది తెలిసిందే… అయితే మనం వాడే కరెన్సీ ఒక్కోసారి చిరిగిపోతూ ఉంటుంది… పలు సార్లు నోట్లకు చిల్లులు పడటం జరుగుతుంది, కొందరు మార్కెట్లో ఇలాంటి నోట్లు ఇస్తే తీసుకోరు, ఇక చాలా మంది టేపు అలాగే ప్లాస్టర్ అంటిస్తారు చినిగిన నోట్లకు… అయితే ఇక్కడ ఎలాంటి చినిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయి అనేది చాలా మందికి తెలియదు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నిబంధనల ప్రకారం చూస్తే చిరిగిన నోట్లను తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది… అయితే మీరు బ్యాంకుకు ఆ నోట్లను తీసుకువెళితే కచ్చితంగా బ్యాంకు వారు అది పరిశీలించి ఎంత బాగం ఉంది అనే దానిపై మీకు నగదు ఇస్తారు.
కనీసం 88 శాతం నోటు ఉండాలి అనే రూల్ ఉంది. ఇక ఇలాంటి నోట్లు మార్చిన సమయంలో ఎలాంటి కమీషన్లు ఉండవు నేరుగా బ్యాంకులు నగదు ఇస్తాయి, అయితే కొన్ని బ్యాంకులు ఇలాంటి నోట్లు తీసుకోవడానికి కొంచెం సమయం ఇవ్వడం జరుగుతుంది.. ఆ సమయంలోనే ఇస్తాయి. ఉదాహరణకు రోజుకి ఓ గంట లేదా అరగంట సమయం కేటాయిస్తాయి.