ఇప్పుడు ప్రతీ దానికి ఆధార్ తప్పనిసరి అయింది, ఆధార్ లేకపోతే ఏ సంక్షేమ పథకానికి అర్హులు కారు, సో బ్యాంకు ఖాతా కావాలి అన్నా ఆధార్ నెంబర్ కచ్చితంగా ఇవ్వాల్సిందే, అయితే ధరఖాస్తు ఏం నింపినా అందులో ఆధార్ నెంబర్ నమోదు చేయాల్సిందే, మరి పెద్దలు ఈజీగా ఆధార్ నెంబర్ ఆధార్ కేంద్రాల్లో పొందుతున్నారు , మరి చిన్న పిల్లలు ఎలా ఆధార్ కార్డ్ పొందాలి అనేది చూద్దాం.
స్కూల్లో అడ్మిషన్ తీసుకునే పిల్లలకు ఆధార్ కార్డును ముందస్తుగా సిద్ధం చేసి పెట్టుకోవడం మంచిది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం కూడా ఆధార్ దరఖాస్తు చేసుకోవచ్చు.
1. తల్లి లేదా తండ్రి మీ పిల్లలని తీసుకుని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లండి
2. అక్కడ అప్లికేషన్ తీసుకుని డీ టెయిల్స్ ఇవ్వండి
3. మీ పిల్లలకి 5 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉంటే పిల్లలకు బయోమెట్రిక్స్ వివరాలు తీసుకోరు.
4. తర్వాత మీ పిల్లవాడిని ఓ ఫోటో తీస్తారు
5. దాన్ని తల్లిదండ్రుల UIDతో అనుసంధానం చేస్తారు.
6. ఇలా మీరు కొత్త ఆధార్ కార్డ్ మీ పిల్లల పేరుపై తీసుకోవచ్చు
7. మీ పిల్లలకు ఐదేళ్లు దాటిన తర్వాత వారి బయోమెట్రిక్ వివరాలు అందించాలి