బెంగళూరులో నివాసముంటున్నారు ఓ జంట… ఆమెకి డెలివరీ అవ్వడంతో భర్తకు ఏటీఎం కార్డు ఇచ్చి నగదు తీసుకురమ్మంది,పిన్ కూడా అతడికి చెప్పింది. ఏటీఎంకు వెళ్లిన భర్త రూ.25,000లు విత్ డ్రా కోసం ప్రయత్నించారు. అయితే లావాదేవీ జరిగినప్పటికీ డబ్బు మాత్రం రాలేదు. నగదు కట్ అయింది అని స్లిప్ వచ్చింది, వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్ కి తెలిపాడు.
ఏటీఎం సమస్య అయి ఉంటుందని 24 గంటల్లో సొమ్ము జమ అవుతుందని బదులిచ్చారు. 24 గంటల తర్వాత కూడా డబ్బు క్రెడిట్ కాకపోవడం వల్ల అతడు బ్రాంచ్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు, అయితే ఇక్కడే అసలు ట్విస్ట్, ఆ అకౌంట్ అతని భార్యది, ఆమె నగదు విత్ డ్రా చేయాలి మీరు ఎలా చేశారని ప్రశ్నించారు?
అంతేకాదు అసలు కార్డు మీకు ఇవ్వకూడదు గోప్యంగా ఉంచాల్సిన పిన్ నెంబర్ చెప్పకూడదు సో దీని వల్ల మీకు నగదు రిఫండ్ రాదు అని తెలిపింది బ్యాంకు..ఏటీఎం కార్డును కేవలం కార్డు హోల్డర్లు మాత్రమే వినియోగించాలని ఇతరుల వాడుకూడదనే నిబంధనను అనుసరించి తెలిపింది, దీంతో వారు కోర్టుకు వెళ్లారు..ఏటీఎం సీసీటీవీ ఫుటేజీ బ్యాంకుకు సమర్పించి బ్యాంకు కూడా దీనిపై తమ వాదన వినిపించింది.. ఏటీఎం పిన్ ఎవ్వరికీ చెప్పకూడదని, డబ్బు కోసం తన భర్తకు చెక్ లేదా అధికారిక లేఖ పూర్వకంగా రాయాల్సిందని కోర్టు చెప్పింది. ఇక ఆనగదు మాత్రం వారికి రాలేదు. అందుకే ఒకరి కార్డు మరొకరు వాడద్దు అంటున్నారు అధికారులు.