భార్య భర్త మాట వింటుంది, ఏం చెబితే అది చేస్తుంది అంటారు.. నిజమే భర్త అడుగుజాడల్లో నడిచే వారు చాలా మంది ఉంటారు, అయితే భర్తలు తప్పుచేస్తే దానికి సలహాలు ఇస్తూ దానిని ఎంకరేజ్ చేసే వారు ఉంటారు, ఇలాంటి వారు చివరకు పోలీసులకి దొరికితే తన భార్య కూడా తనకు సపోర్ట్ చేసింది అని చెప్పిన ఘటనలు ఉన్నాయి.
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కువగా బెట్టింగ్ల హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఓ జంట పోలీసులకి అడ్డంగా దొరికింది. గోవా నుంచి భర్త క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే నగరంలో భార్య నగదు వసూలు చేస్తూ ఉంటుంది. అన్యోన్య దంపతులను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు.
డబ్బులు బాగా వస్తున్నాయి అని ఏకంగా ఎవరిని పెట్టుకోవడం ఎందుకని భర్త భార్యతో ఈ రాకెట్ నడిపిస్తున్నాడు. ఇక బెట్టింగ్ డబ్బుల కోసం కొందరు ఇంటికి వస్తే ఎవరైనా ఇవ్వకపోతే ఆమె ఇంటికి వెళ్లి వసూలు చేస్తోంది, మొత్తానికి వీరి విషయం పోలీసులకు తెలిసింది పక్కా సమాచారంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.