కొన్ని ఘటనలు మనకు ఒక్కోసారి కన్నీరు తెప్పిస్తాయి, ఎంతో బాధని కలిగిస్తాయి ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచింప చేస్తాయి, ఈ ప్రపంచం నడిచేది డబ్బుతోనే అని చెప్పాలి, పైసా లేకపోతే ముందుకు వెళ్లలేము అనేది తెలిసిందే, అయితే భర్తకి ఓ పక్క అనారోగ్యం వైద్యం చేయించాలి అంటే చేతిలో నగదు లేక ఇబ్బంది పడింది ఆ ఇల్లాలు..
ఈ సమయంలో ఆమె భర్తని కాపాడుకోవాలి అని ఏకంగా తన కొడుకుని తాకట్టు పెట్టింది.. వింటేనే బాధగా ఉంది కదా…ఒడిశాలోని గంజాం జిల్లా భంజ్నగర్కు చెందిన జిలీ నాయక్ భర్త దుఖా నాయక్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.. ఆనాటి నుంచి ఇంటిలోనే ఉంటున్నాడు..
ఇటీవల అతనికి మరింత అనారోగ్యం వచ్చింది, ఇక వైద్య చికిత్స కోసం ఆమె చేతిలో నగదు లేదు.. దీంతో చికిత్స ఖర్చుల కోసం తన ఐదు నెలల కుమారుడిని సొంత అక్క వద్ద రూ.10 వేలకు తాకట్టు పెట్టింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఈ వార్త పెను వైరల్ అవుతోంది.