ఇంట్లోకి భార్య వచ్చింది అంటే తల్లిదండ్రులని అలాగే తోబుట్టువులని అందరిని బాగా చూసుకోవాలి అని కోరుకుంటాం, అందరితో కలిసి ఉంటే బాగుంటుంది అని ఏ భర్త అయినా కోరుకుంటాడు, ఇక్కడ చిక్ బల్లాపూర్ లో దామోదర్ కు వివాహం అయి రెండు సంవత్సరాలు అయింది.. అతను వ్యవసాయం చేసుకుంటూ తనకు ఉన్న రెండు వ్యాన్ లు కిరాయికి తిప్పుకుంటున్నాడు..
ఆర్దికంగా ఎలాంటి ఇబ్బంది లేదు.. ఇక మానని అనే అమ్మాయిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు, అయితే ఇంట్లో అతనితో పాటు అతని చెల్లి కామాక్షి కూడా ఉంటోంది.. ఆమె పుట్టుకతోనే కాస్త వికలాంగురాలు ఈ సమయంలో ఆమెని కూడా తల్లితండ్రి లేకపోవడంతో సొంత తండ్రిలా అన్న చూసుకుంటున్నాడు.
ఇలా రెండేళ్లు ఆమెపై భర్త చూపిస్తున్న ప్రేమకి భార్యకి విసుగు వచ్చింది, ఆమెని ఎక్కడైనా వదిలి రావాలి అని లేదంటే ఎక్కడైనా అనాధ ఆశ్రమంలో వదిలెయ్యాలి అని కోరింది, దీంతో భర్త దానికి ఒప్పుకోలేదు.. దీంతో పుట్టింటికి ఆమె వెళ్లిపోయింది, ఇక కాపురానికి రాను అని చెప్పడంతో అతను కూడా వదిలేశాడు..
చివరకు ఆమె భర్తని బెదరించేందుకు విడాకుల నోటీస్ పంపింది.. అతను కూడా ఒకే అన్నాడు, దీంతో అతనికి సర్దిచెప్పడానికి అత్తమామ వచ్చారు, అతను మాత్రం పోలీస్ స్టేషన్ కు ఈ పంచాయతీ తీసుకువెళ్లాడు, తన చెల్లిని చూసుకోపోతే ఆమెకి విడాకులు ఇస్తాను అని చెప్పాడు… దీంతో అందరూ అతని ప్రేమని చూసి కన్నీరు పెట్టున్నారు… అంతేకాదు అతని చెల్లి వయసు 21 ఏళ్లు ఆమెని ఎలా వదిలేస్తాను అని బాధపడుతున్నాడు అతను.
ReplyForward
|