ఈ కరోనా లాక్ డౌన్ వేళ చాలా మంది ఆఫీసులకి వెళ్లడం లేదు.. అంతా ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా వీడియో కాల్స్ జూమ్ మీటింగులతోనే అన్నీ కంపెనీలు ప్రాజెక్టులు చేస్తున్నాయి, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొన్ని కంపెనీలు మంచి లాభాలు గడించాయి ఈ ఏడాదిలో…మొత్తానికి ఆఫీసువారు అందరూ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్కే అలవాటు పడ్డారు.
జూమ్ కాల్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్… ఇలా వేర్వేరు ప్లాట్ఫామ్స్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇక సరదా సన్నివేశాలు కూడా జరుగుతున్నాయి, మరి తాజాగా ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతోంది, ఓ వ్యక్తి జూమ్ కాల్ లో బిజీగా ఉన్నాడు, అతను మీటింగ్ లో మాట్లాడుతున్నాడు.
కాని అనూహ్యాంగా అతని భార్య దగ్గరకు వచ్చి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది.. ఇక ఇలా ఒక్కసారిగా అతను వారించాడు, వెంటనే ఆమెని వారించడంతో ఆమె పక్కకు వెళ్లిపోయింది.. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
వీడియో చూడండి.
Zoom call …..so funny ? ??pic.twitter.com/6SV62xukMN
— Harsh Goenka (@hvgoenka) February 19, 2021