భర్తలను మోస్తు భార్యలు పరుగులు – ఈ పందెం చూడండి 

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అన్నీ దేశాల్లో జరుపుకుంటారు, ఇక పలు పోటీలు జరుగుతాయి, ఇప్పుడు ఇలాంటి పోటీల గురించి చెప్పుకోవాలి.. నేపాల్లోని ఒక గ్రామంలో  భర్తలను వీపుపై మోస్తూ భార్యలు పరుగెత్తే పోటీలను ఏర్పాటు చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఇక్కడ ఇలాంటి వింత పరీక్ష పెట్టారు.. కాని దీని వెనుక చాలా పెద్ద రీజన్ చెబుతున్నారు అక్కడ పెద్దలు.
 వంద మీటర్ల పరుగు పందెంలో గమ్యాన్ని చేరుకునే వరకు ఎవరు భర్తలను మోస్తూ వేగంగా పరుగెత్తుతారో, వారే విజయం సాధిస్తారు. ఇలా చేయడం ఎందుకు అంటే ఆ మహిళల సామర్ధ్యం తెలుస్తుంది అని చెబుతున్నారు అక్కడ వారు..
నేపాల్లోని దేవఘాట్ అనే గ్రామంలో ఇది జరిగింది. సుమారు ఇందులో పాల్గొనడానికి 16 జంటలు వచ్చాయి.. అన్ని వయసుల వారు ఇందులో ఉన్నారు.
ఇక్కడ గెలిచిన వారికి నగదు ఫ్రైజులు ఇవేమీ ఇవ్వరు.. కాని వారు పాల్గొన్నారు అని ప్రశంసా పత్రం ఇస్తారు. అయితే ఇలా పోటీ పెట్టడం ఇదే తొలిసారి..  ఇక ప్రతీ ఏడాది ఇలా చేస్తాము అని చెబుతున్నారు అక్కడ పెద్దలు… మగవారి కంటే స్త్రీలు ఎక్కడా తక్కువ కాదు అనేలా ఇలాంటి అనేక పోటీలు నిర్వహిస్తాము అంటున్నారు అక్కడ వారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...