కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరోనా నిబంధనలతో 2 కేంద్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 22 రౌండ్లలో జరగనున్న ఈ ప్రక్రియలో ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశముంది. తొలి రౌండ్ లో హుజూరాబాద్ మండల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్ లో బీజేపీ లీడ్ సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టిఆర్ఎస్ కు 4,444 ఓట్లు రాగా, బీజేపీకి 4,610 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి.
కాగా తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్, భాజపా నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు హుజూరాబాద్ బాద్షా ఎవరో తేలనుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది.