హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రౌండ్‌రౌండ్‌కు బీజేపీకి ఆధిక్యం పెరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా అన్నింట్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఐదో రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు 2169 ఓట్ల ఆధిక్యం ఈటలకు లభించింది. మొత్తంగా ఐదు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 22,327.. టీఆర్‌ఎస్ 20,158.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి.
ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్ గుర్తులు చుక్కలు చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన ఓట్లు 114 కంటే ఎక్కువగా ఇండిపెండెంట్ రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పోలయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో హుజూరాబాద్ మండల ఓట్లను లెక్కిస్తారు.
కాగా తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్, భాజపా నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు హుజూరాబాద్ బాద్షా ఎవరో తేలనుంది.