కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరోనా నిబంధనలతో 2 కేంద్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 22 రౌండ్లలో జరగనున్న ఈ ప్రక్రియలో ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశముంది.
రెండు రౌండ్లు కలిపి బీజేపీ 359 ఓట్లు ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్‌లో బీజేపీ 4659, టీఆర్ఎస్ 4851, కాంగ్రెస్ 220 ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్ టౌన్‌లోని సగం ఓట్లు రెండో రౌండ్‌లో లెక్కించారు. సిర్సపల్లి, సింగాపూర్, తమ్మనపల్లి, మందపల్లి, బోయినపల్లిలోని ఓట్లను లెక్కించారు. మూడో రౌండ్‌లో హుజురాబాద్ మిగిలిన భాగం లెక్కిస్తారు. TRSకు పట్టున్న మండలం హుజురాబాద్, హుజురాబాద్ టౌన్ కాగా ఇక్కడే బీజేపీ బోణి కొట్టింది అంటే ఆలోచించాల్సిన విషయం.