హుజూరాబాద్ బైపోల్- కాంగ్రెస్‌ క్యాంపయిన‌ర్ల‌ జాబితా ఇదే..

0
91

తెలంగాణ: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. దీనితో ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు..ఇప్పటికే రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న ఇరుపార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ నుండి హరీష్ రావు అన్ని తానై ఉపఎన్నికను తన భుజాలపై వేసుకున్నాడు. అటు బీజేపీ నుండి బండి సంజయ్ ఇప్పటికే ప్రచారంలో జోరు పెంచారు.

ఈ నేప‌థ్యంలో త‌మ‌ క్యాంపయిన‌ర్ల‌ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుద‌ల చేసింది.  20 మందితో కూడిన క్యాంపయిన‌ర్ల‌ జాబితా విడుద‌ల చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ జాబితాలో కాంగ్రెస్ నేత‌లు మాణిక్కం ఠాగూర్‌, రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు, దామోద‌ర రాజ‌న‌ర్సింహా కూడా ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఈ ఉప ఎన్నిక‌లో బల్మూరి వెంకట్ బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే.