తెలంగాణ: హుజూరాబాద్ బైపోల్ దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచారు. కాగా నేటితో ఉపఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఓట్లను లెక్కించనున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్ 1న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుండి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి వెంకట్ బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపును తన భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు..ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.