Big breaking: హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

Huzurabad by-election schedule released

0
94

తెలంగాణలోని హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా..అక్టోబర్ 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన, 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. ఆ తరువాత ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం ఖాళీ అయింది. అటు ఏపీలోని బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఉపఎన్నికలు జరగనున్నాయి.