కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరోనా నిబంధనలతో 2 కేంద్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 22 రౌండ్లలో జరగనున్న ఈ ప్రక్రియలో ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశముంది.
మూడో రౌండ్ లో కూడా బీజేపీ లీడ్ లో ఉంది. వరుసగా మూడు రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి మూడో రౌండ్లో 911 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇప్పటివరకు 1269 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.
దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన సాల్ల పల్లి గ్రామంలో కూడా బిజెపి ఆధిక్యం సాధించడం విశేషం. అలాగే TRSకు పట్టున్న మండలం హుజురాబాద్, హుజురాబాద్ టౌన్ కాగా ఇక్కడే బీజేపీ బోణి కొట్టింది అంటే ఆలోచించాల్సిన విషయం.