కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరోనా నిబంధనలతో 2 కేంద్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 22 రౌండ్లలో జరగనున్న ఈ ప్రక్రియలో ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశముంది. వరుసగా మూడు రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి మూడో రౌండ్లో 911 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇప్పటివరకు 1269 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక నాలుగో రౌండ్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందు నుంచి ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. నాలుగవ రౌండ్‌లోనూ తన లీడ్‌ను కనసాగిస్తున్నారు.
హుజురాబాద్ అప్డేట్స్
4వ రౌండ్ లో 1695 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ