బిగ్ బ్రేకింగ్: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి విషమం

0
77

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరాకరించినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించారు.

అయితే, ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.

ఈ లాఠీచార్జ్ లో హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, NSUI ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడించారు. దీంతో హుటాహుటిన వెంకట్ ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందజేస్తున్నట్లు వెంకట్ బల్మూరి ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.