ఇప్పటివరకు వరుస రౌండ్లలో ఆధిక్యంతో దూసుకుపోతున్న ఈటల రాజేందర్ కు షాక్ తగిలింది. తాజాగా ఎనిమిదో రౌండ్లో అనూహ్యంగా టీఆర్ఎస్ 162 ఓట్లతో లీడ్ లోకి వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత ఊరూ హిమ్మత్ నగర్ లో ఈ ఆధిక్యం వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు కమలం జోరు మీదుండగా కారు ఆ జోరుకు బ్రేకు వేసింది. ఇక ఇప్పటి నుండి కౌంటింగ్ మరింత ఆసక్తికరంగా మారనుంది. మొత్తంగా ఈటల 3270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇక ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు..
టిఆర్ఎస్ : 4,248 ( 31,837)
బీజేపీ : 4,086 ( 35,107 )
కాంగ్రెస్ : 89 (1,175)
టిఆర్ఎస్ లీడ్ : 162