హుజూరాబాద్ ఉపపోరు- 9వ రౌండ్ లో కమలం జోరు

Huzurabad sub-battle - 9th round results ..

0
66

ఏడు రౌండ్లలోనూ ఈటల రాజేందర్‌ ఆధిక్యం దక్కించుకున్నారు. రౌండ్​రౌండ్‌కు కమలం పార్టీ లీడ్ కనిపించింది. ఎనిమిదో రౌండ్లో అనూహ్యంగా టీఆర్ఎస్ 162 ఓట్లతో లీడ్ లోకి వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత ఊరూ హిమ్మత్ నగర్ లో ఈ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది.

తాజాగా తొమ్మిదో రౌండ్లో మళ్లీ బీజేపీ హవా కొనసాగించింది. తొమ్మిదో రౌండ్ లో 1835 ఓట్లు ఆధిక్యంలో బీజేపీ వుంది. మొత్తంగా ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా హిమ్మత్‌నగర్‌లో గెల్లు శ్రీనివాస్ కంటే ఈటలకు 191 ఓట్ల ఆధిక్యం రావడం ఆశ్ఛర్యకరం. హిమ్మత్‌నగర్‌లో భాజపాకు 549 ఓట్లు రాగా తెరాసకు 358 ఓట్లే వచ్చాయి.