హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 7 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు ఈటెల రాజేందర్ పిఆర్వోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఈటల కాన్వాయ్ లోని మూడు వాహనాలను సీజ్ చేశారు. అలాగే 51వ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏ కిరణ్ డబ్బులు పంచుతుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
హుజూరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన సీఈవో… అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84.5 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందని చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు.