హూజూరావార్..అక్కడ టెన్షన్ వాతావరణం

Huzurabad Bipole..Tension atmosphere there

0
72

తెలంగాణ: హుజూరాబాద్ లో పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జమ్మికుంట మండలం కోరపల్లిలో టెన్షన్ నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు టీఆర్ఎస్ సర్పంచ్ డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ భారీగా జనం గుమిగూడారు.

కమలాపూర్ మండలం గూడూరులో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులకు మధ్య గొడవ జరిగింది. తెరాస వర్గీయులు డబ్బు పంచుతున్నారని భాజపా వర్గీయుల ఆరోపించారు. దీనితో ఘర్షణ వాతావరణం నెలకొంది.మరో మూడు గంటల్లో పోలింగ్ ముగియనుండగా భారీ సంఖ్యలో జనం క్యూలో ఉన్నారు. దీనితో ఓటింగ్ శాతం భారీగా పెరిగేలా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదు అయింది.