ఈ కరోనా సమయంలో మార్చి నెల చివరి నుంచి పూర్తిగా కరోనా వైరస్ విస్తరించడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఆర్టీసీ బస్సులు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి.. ఇప్పటికే అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, జిల్లాలో బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
మరి ఎప్పుడు హైదరాబాద్ సర్వీసులు స్టార్ట్ అవుతాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే తాజాగా వీరికి గుడ్ న్యూస్, ఎందుకు అంటే తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ ఆర్బీసీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ సబర్బన్, ముఫిసిల్ సర్వీసులు తెల్లవారు జాము నుంచి రోడ్డెక్కాయి.
తాజాగా మొత్తం 200 బస్ ట్రిప్ సర్వీసులను ప్రారంభించింది గ్రేటర్ ఆర్టీసీ.. కానీ, హైదరాబాద్ సిటీలో నడిచే సిటీ బస్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు… అయితే ఈ వారంలో నిర్ణయం తీసుకుంటారు వచ్చే వారం నుంచి అవి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు..సిద్దంగా ఉండాలి అని డ్రైవర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది.