హైదరాబాద్ లో పంచతత్వ పార్కు దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా

హైదరాబాద్ లో పంచతత్వ పార్కు దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా

0
107

పంచతత్వ పార్కును ప్రారంభించారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, ఇప్పుడు ఈ ఆపార్కు గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది, ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు, హైదరాబాద్ లోని ఇందిరాపార్కులోని పంచతత్వ పార్కును మంత్రి ప్రారంభించారు.

ఒక ఎకరం విస్తీర్ణంలో ఆక్యూప్రేజర్ శరీరంపై ఒత్తిడి కలిగించు వాకింగ్ను నిర్మించడం జరిగింది. దోమలగూడలోని ఇందిరా పార్కు నందు ఒక ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్ పార్కును ఇలా తయారు చేశారు…మరి ఈ ట్రాక్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా.

కంకరరాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో ట్రాక్ నిర్మాణానికి వాడారు, మనం నడిచే సమయంలో పాదాల అడుగు భాగంలోనరాలపై ఒత్తిడి పడుతుంది. 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివర్ స్టోన్స్, 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్ను నిర్మించారు. అయితే ఇలా నడవటం వల్ల రక్తప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయి, ఇక హైదరాబాద్ లోని పలు పార్కుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.