హైదరాబాద్ లో ప్రారంభం కానున్న సిటీ బస్సు సేవలు ఎప్పటినుంచంటే

హైదరాబాద్ లో ప్రారంభం కానున్న సిటీ బస్సు సేవలు ఎప్పటినుంచంటే

0
106

మొత్తానికి ఏపీలో సీటీ బస్సు సర్వీసులు స్టార్ట్ అయ్యాయి, అయితే తెలంగాణలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఎప్పుడు సిటీ బస్సులు ప్రారంభం అవుతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కోటి మంది జనాభా ఉండే నగరం, అంతేకాదు ఇప్పటికే మెట్రో సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి, ఈ సమయంలో హైదరాబాద్ లో సిటీ బస్సులు ప్రారంభం కానున్నాయి అని తెలుస్తోంది..ఈ నెలాఖరున గ్రేటర్ పరిధిలో సిటీ బస్సుల సేవలు మొదలవుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.

గ్రేటర్ పరిధిలోని సిటీ బస్సులను కూడా నిబంధనల మేరకు నడిపించేందుకు ఏర్పాట్లు మొదలైపోయాయని తెలిపారు అధికారులు. దీనిపై రెండు రోజుల్లో కీలక ప్రకటన రానుంది, ఇక 50 శాతం ప్రయాణికులతోనే బస్సులు నడుస్తాయి అని తెలుస్తోంది, పూర్తిగా జాగ్రత్తలు తీసుకుని బస్సులు గ్యారేజ్ నుంచి తీయనున్నారు..టీఎస్ ఆర్టీసీ 1,400 రూట్లలో 3 వేలకు పైగా బస్సులతో 43 వేల ట్రిప్ లను నడుపుతూ, 30 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చేది. మార్చి 22 నుంచి సిటీ బస్సులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త విన్న హైదరాబాద్ ప్రజలు చాలా సంతోషంలో ఉన్నారు.