బ్రేకింగ్ – హైదరాబాద్ కరోనా హాట్ స్పాట్స్ లిస్ట్ ఇదే

బ్రేకింగ్ - హైదరాబాద్ కరోనా హాట్ స్పాట్స్ లిస్ట్ ఇదే

0
84

తెలంగాణలో కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది, ఎక్కడ చూసినా కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతోంది, ఇది జనాలని కలవరపాటుకి గురిచేస్తోంది, తెలంగాణలో వస్తున్న కేసుల్లో దాదాపుగా 70 శాతం పైచిలుకు కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో నిత్యం వందల కేసులు నమోదు అవుతున్నాయి.

ఇలాంటి ప్రాంతాలను గుర్తించింది సర్కార్ .. అంబర్ పేట్, యూసఫ్ గూడ, కార్వాన, రాజేంద్రనగర్ ,
మెహదీపట్నం, కుత్బుల్లాపూర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్ ప్రాంతాలను నగరంలోని ఎనిమిది హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు , ఇక్కడ జోన్లు గుర్తించారు ఇక వచ్చే రోజుల్లో కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయనుంది.

అయితే హైదరాబాద్ కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోంది, దీంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏపీకి అయితే కచ్చితంగా స్పందనలో ఈ పాస్ తీసుకోవాలి అని నియమం ఉంది, అయితే తెలంగాణకు ఇలాంటి నియమం లేదు, దీంతో అన్నీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు రాకపోకలు జరుగుతున్నాయి.