హైదరాబాద్ లో భారీగా తగ్గిన చికెన్ ధర

హైదరాబాద్ లో భారీగా తగ్గిన చికెన్ ధర

0
105
Pieces of raw chicken meat. Raw chicken legs in the market.

మే నెల అన్నింటికి డిమాండ్ ఉంటుంది, వివాహాలు విందులు పార్టీలు ఇలా చాలా ఉంటాయి, ఓ పక్క సమ్మర్ అందుకే ఈ సమయంలో చాలా వరకూ అన్నీ కార్యక్రమాలు జరుగుతాయి…అయితే ఈ సమ్మర్ లో వివాహాల సమయంలో కూడా ముక్క కచ్చితంగా ఉంటుంది అదే నాన్ వెజ్…. అయితే ఈనెలలో సాధారణంగా కంటే రేటు ఎక్కువ ఉంటుంది…అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి.

 

దీంతో పెళ్లిళ్లు శుభకార్యాలు అన్నీంటికి చాలా తక్కువ మంది వస్తున్నారు.. మరికొన్ని చోట్ల కేవలం కుటుంబాలు మాత్రమే హాజరు అవుతున్నారు… దీంతో నాన్ వెజ్ కి పెద్ద డిమాండ్ లేదు… ఈ హోటల్స్ క్లోజ్ లో ఉంటున్నాయి.. దీంతో చాలా వరకూ నాన్ వెజ్ అమ్మకాలు తగ్గాయి.

 

మే నెలలో ఎన్నడూ లేనంతగా చికెన్ రేటు తగ్గిపోయింది….హైదరాబాదులో కిలో కోడి మాంసం ధర రూ.100కు పైగా తగ్గింది..

నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర రూ.270 ఉంటే ఇప్పుడు కేవలం 150 కి వస్తోంది, ఇక లైవ్ కోడి రూ.100గా ఉంది.