MLA Raja Singh: అడ్వైజరి బోర్డు ముందుకు ఎమ్మెల్యే రాజాసింగ్..కీలకంగా మారనున్న విచారణ

0
124
MLA Raja Singh

Hyderabad MLA Raja Singh to appear before PD act advisory board: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై నేడు అడ్వైజరి కమిటీ విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న రాజాసింగ్ ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా కమిటీ విచారించనుంది. అయితే రాజాసింగ్(MLA Raja Singh ) బెయిల్ పై అడ్వైసరి బోర్డ్ విచారణ కీలకం కానుంది.  ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు పీడీ యాక్ట్ ప్రపోజర్స్ ను పరిశీలించనుంది. అయితే పీడీ యాక్ట్ లో 3 నెలలు నుంచి ఏడాది వరకు జైల్లోనే ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కోర్టుకు ఇప్పటికే సాక్ష్యాలు సమర్పించారు. రాజాసింగ్ ఓ మతానికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలతో ఆగస్టు 25న పోలీసులు అరెస్ట్ చేశారు.

సీఎం కేసీఆర్ పై ఈటెల సెన్సేషనల్ కామెంట్స్