వాహ‌నాదారులు అల‌ర్ట్ – హైద‌రాబాద్ లో ఒక్క చ‌లాన్ ఉన్నా బండి సీజ్

Hyderabad Motorists Alert

0
89

కొంద‌రు వాహ‌న‌దారులు బైక్ పై చ‌లాన్లు ఉన్నా వాటిని క్లియ‌ర్ చేయ‌కుండా ద‌ర్జాగా తిరుగుతూ ఉంటారు. కొత్త‌గా ఫైన్లు ప‌డుతున్నా ప‌ట్టించుకోరు. ఇక తెలిసిన వారికి వాహ‌నాలు ఇవ్వ‌డం వ‌ల్ల వారు రూల్స్ అతిక్ర‌మించడం వ‌ల్ల ఫైన్లు ప‌డినా ఓన‌ర్ కు తెలియ‌దు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా జ‌రుగుతున్నాయి. ఇక పోలీసులు బండి ఆపిన స‌మ‌యంలో చలాన్లు ఉన్నాయి అనే విష‌యం తెలియ‌దు అంటారు.

హైదరాబాద్‌లోని వాహనదారులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై ఒక్క ట్రాఫిక్ చలానా ఉన్నా వాహనాన్ని సీజ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇక క‌చ్చితంగా చ‌లాన్లు క్లియ‌ర్ చేసుకోవాల్సిందే. గ‌తంలో మూడు చ లాన్ లు ఉంటే వెంట‌నే వెహిక‌ల్ సీజ్ చేసేవారు, ఇక పై ఒక చ‌లాన్ ఉన్నా క‌చ్చితంగా బండి సీజ్ అవుతుంది.

పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి చలానాలు పెండింగులో ఉన్న వాహనాలను పట్టుకుని చలానాలు కట్టిస్తున్నారు. ఇక వెహిక‌ల్స్ ఎవ‌రికి అయినా ఇచ్చినా క‌చ్చితంగా చ‌లాన్ ప‌డిందో లేదో తెలుసుకోండి అంటున్నారు.