తెలంగాణలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు భారీగా వస్తున్నాయి, అయితే దేవాలయాలకు కూడా చాలా మంది భక్తులు రాక తగ్గింది, హైదరాబాద్ అంటే ముందు గుర్తు వచ్చేది పెద్దమ్మ తల్లిదేవాలయం.
అయితే ఇక్కడ శ్రావణం కావడంతో చాలా మంది భక్తులు వస్తారు, ఈ కరోనా సమయంలో భక్తుల రద్దీ తగ్గింది, ఆలయంలో మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తూ సర్కిల్స్ ను ఏర్పాటు చేసారు.
తాజాగా పెద్దమ్మ తల్లి దేవస్థానం ఓ నిర్ణయం తీసుకుంది. దర్శనం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా గొడుగు ఉండాలనే నిబంధనలను పెట్టింది. ఆలయం లోపలి అడుగు పెట్టిన భక్తులు తప్పనిసరిగా గొడుగు ఓపెన్ చేసి పట్టుకోవాలి. దర్శనం పూర్తి చేసుకొని బయటకు వెళ్లే వరకు గొడుగు మూయకూడదు. ఇక భక్తుల మధ్య దూరం కూడా ఉండాలి అని తెలిపింది, ఆలయంలో అధికారులు కచ్చితంగా దీనిని పాటించేలా చేస్తున్నారు, భక్తులకి తెలిసేలా బయట బోర్డులు పెట్టారు.