తెలంగాణలో అన్నీ ప్రాంతాల్లో బస్సులు రోడ్లపైకి వచ్చాయి, హైదరాబాద్ లో ఉన్న కంటైన్మెంట్ ఏరియాలో బస్సులు తిరగడానికి లేదు, ఇక నగరంలో కేసులు తీవ్రత ఉంది. అందుకే ఇక్కడ సిటీ బస్సులకి కూడా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 58 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 6 వేల బస్సులు నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది.
ఇక ఎక్కడా బస్సు చార్జీలు పెరగలేదు, ప్రయాణికులు ఆందోళన చెందవద్దు, ఉదయం ఆరు నుంచి రాత్రి 7 లోపు బస్సులు తమ రూట్లలో నడిపి స్టాండ్ కు వచ్చేయాలి, అలాగే ఎంజీబీఎస్ వరకు బస్సులను అనుమతించరు. కేవలం జిల్లాలకు జూబ్లి బస్ స్టాప్ నుంచి బస్సులు బయలుదేరుతాయి, అక్కడ నుంచి ప్రారంభం అవుతాయి.
ఇప్పుడు బస్ రూట్లు చూద్దాం
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బస్సులు.. జేబీఎస్ వరకూ వస్తాయి, అక్కడ నుంచి బయలుదేరుతాయి,వరంగల్ బస్సులు ఉప్పల్ వస్తాయి అక్కడ నుంచి బయలుదేరుతాయి, నల్గొండ బస్సులను హయత్ నగర్ నుంచి నడిపిస్తారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చేవి ఆరాంఘర్ వస్తాయి..
సంగారెడ్డి నుంచి వచ్చేవి బీహెచ్ఈఎల్ వరకు మాత్రమే అలౌ చేస్తారు, అక్కడ నుంచి వచ్చేవారు ఎవరు నగరంలోకి వచ్చినా కచ్చితంగా ఆటోలు క్యాబ్స్ లో వెళ్లాల్సి ఉంటుంది.