దేశ వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ అమలులో ఉంటుంది, అయితే కేసుల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిటీ బస్సులు నడుస్తాయా నడవవా అని హైదరాబాద్ ప్రజలు అందరూ భావిస్తున్నారు…ఈ సమయంలో కీలక ప్రకటన అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు..
హైదరాబాద్లో సిటీ బస్సులను ఇప్పుడే నడపవద్దని తెలంగాణ సీఎం అధికారులకు స్పష్టం చేశారు. రాజధానిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతరాష్ట్ర సర్వీసులు కూడా నడపాలి అని తెలిపారు సీఎం కేసీఆర్.గ్రేటర్ పరిధిలో కేసులు పెరుగుతున్న కారణంతో ఇప్పుడు బస్సులు నడిపితే ప్రమాదం అని అందుకే ఆర్టీసీ సిటీ సర్వీసులు వద్దు అని తెలిపారు.
రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికం జీఎచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్న నేపథ్యంలో.. సిటీ బస్సులను తిప్పితే మరింత ఇబ్బందులు తప్పవని సీఎం కేసీఆర్ భావించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మంచిదే అంటున్నారు అందరూ.