హైద‌రాబాద్ లో మీకు డీజిల్ కారు ఉందా అయితే మీకు బ్యాడ్ న్యూస్

హైద‌రాబాద్ లో మీకు డీజిల్ కారు ఉందా అయితే మీకు బ్యాడ్ న్యూస్

0
103

హైద‌రాబాద్ లో కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే… అయితే రోజు రోజుకి వాహ‌నాల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది.. రోడ్ల‌పై వాహ‌నాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో వెళుతూనే ఉన్నాయి.. దీని వ‌ల్ల వాయు కాలుష్యం కూడా విప‌రీతంగా పెరిగిపోతోంది.

అందుకే న‌గ‌రంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఢిల్లీ లాంటి పరిస్థితులు ఎదురుకావడానికి ముందే మేల్కొనాలని భావిస్తున్న ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రవాణశాఖకు సూచించినట్టు తెలుస్తోంది.
అయితే ఎక్కువ‌గా డిజిల్ వాహ‌నాల వ‌ల్ల కాలుష్యం పెరుగుతోంది.. అందుకే 12 ఏళ్లు దాటిని డిజీల్ వాహ‌నాలు నిషేదించాలి అని నిర్ణ‌యించార‌ట అధికారులు. కార్లు వ్యానులు లారీలు ఇలా చాలా వాహ‌నాలు ఉన్నాయి.

నగరంలో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద ఎత్తున కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. దీంతో డీజిల్ వాహనాల సంఖ్య మరింత పెరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోల్ వాహ‌నాల‌కంటే డీజిల్ వాహ‌నాల‌కు రెండు శాతం అధికంగా కూడా ప‌న్ను ఉంది.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనుగోలు చేసేలా ప్ర‌క‌ట‌న‌లు రానున్నాయ‌ట‌.