హైద‌రాబాద్ లో మీరు ఆరోజు ఆ మాల్ కు వెళ్లారా అయితే క‌రోనా టెస్ట్ చేయించుకోండి

హైద‌రాబాద్ లో మీరు ఆరోజు ఆ మాల్ కు వెళ్లారా అయితే క‌రోనా టెస్ట్ చేయించుకోండి

0
73

తెలంగాణ‌లో కూడా క‌రోనా విజృంభిస్తోంది , ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేస్తున్నారు అధికారులు, పెద్ద ఎత్తున స్కూల్లు కాలేజీలు హ‌స్ట‌ల్స్ అన్నీ మూసేస్తున్నారు, వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కాన్సెప్ట్ కూడా తీసుకువ‌చ్చారు, అయితే తాజాగా తెలంగాణ‌లో 15 పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి, అన్నీ వేరే ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారివే కాని ఇక్క‌డ వారికి ఎవ‌రికి లేదు.

అయితే తాజాగా మ‌రో వార్త వినిపిస్తోంది. ఈ నెల 11న హైదరాబాద్ పంజాగుట్టలోని గలేరియా మాల్‌ను సందర్శించిన వారు జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ రోజున మాల్‌కు వెళ్లినవారు అందరూ స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉండాలని సూచించింది.

దీనికి కార‌ణం ఉంది, ఆరోజు క‌రోనా పాజిటీవ్ ఉన్న రోగి మాల్ లో తిరిగాడ‌ట‌, అందుకే ఆరోజు మాల్ కు వెళ్లిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి అని 14 రోజులు ఇంట్లో ఉండాలి అని చెబుతున్నారు, ఏదైనా అనారోగ్యం అనిపిస్తే వెంట‌నే 104 కి కాల్ చేయాలి అని చెప్పారు… ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నా, కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వచ్చినా తెలియ‌చేయాలి అని సూచించారు.