హైదరాబాద్ ప్ర‌జ‌లు ఈ ఐదు రోజులు జాగ్రత్త బ‌య‌ట‌కు వెళితే ఇవి త‌ప్ప‌క తీసుకువెళ్లండి

హైదరాబాద్ ప్ర‌జ‌లు ఈ ఐదు రోజులు జాగ్రత్త బ‌య‌ట‌కు వెళితే ఇవి త‌ప్ప‌క తీసుకువెళ్లండి

0
88

ఈ వ‌ర్షాలు వ‌ద‌ల‌డం లేదు.. ఏపీ తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి, అయితే హైద‌రాబాద్ న‌గ‌రంలో రెండు రోజులుగా ఎక్క‌డ‌చూసినా భారీ వ‌ర్షం న‌గ‌రంలో ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ ఎడ‌తెర‌పి లేని వ‌ర్షం కురిసింది, అయితే హైద‌రాబాద్ వాసుల‌కి మ‌రో వార్త‌, మ‌రో ఐదు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది అంటున్నారు వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు.

శని..ఆదివారాల్లో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక హైద‌రాబాద్ తో పాటు మిగిలిన జిల్లాల్లో తెలంగాణ‌లో చాలా వ‌ర‌కూ కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురువ‌నున్నాయి.
ఉమ్మడి వరంగల్.. ఖమ్మం.. నల్గొండ.. కరీంనగర్ జిల్లాల్లో భారీ వ‌ర్షం కుర‌వ‌నుంది.

ఇక హైద‌రాబాద్ లో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో గొడుకు తీసుకువెళ్లండి, ఇక గుంపులుగా ఎక్క‌డికి వ‌ద్దు, మాస్క్ పెట్టుకోవాలి, ఇక వీలైతే ఇంట్లో నుంచి ఒక‌రు మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్లండి.
వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, హెల్మెట్ కూడా త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాలి అని అంటున్నారు నిపుణులు.