ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు నాకు ఈ పెళ్లి చేసుకోవాలి అని లేదు ప్లీజ్ దయచేసి నాకు సాయం చేయండి అని పెళ్లి కుమార్తె పెళ్లి మండపం నుంచి పోలీసులకు ఫోన్ చేసింది, వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు, తల్లిదండ్రులని ప్రశ్నించారు చివరకు ఆ పెళ్లి నిలిచిపోయింది, అందరి మధ్య ఇలా పెళ్లి ఆగిపోవడంతో వరుడి తండ్రి ఎంతో అవమానంగాభావించారు.
ఈ సమయంలో పెళ్లికొచ్చిన సమీప బంధువైన అమ్మాయితో అదే ముహూర్తానికి పెళ్లి జరిపించారు…. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు, తనకు ఈ వివాహం ఇష్టం లేదని, తానో యువకుడిని ప్రేమించానని, దయచేసి ఈ పెళ్లిని ఆపాలంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే దీనిపై అందరూ షాక్ అయ్యారు, ఇదేదో ముందే వరుడికి చెప్పి ఉంటే సరిపోయేది కదా, ఇప్పుడు అందరిని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటి అని అందరూ చర్చించుకున్నారు, ఇక వరుడి తండ్రి బంధువుల అమ్మాయి అక్కడ ఉంటే వారి పేరెంట్స్ తో మాట్లాడి ఆ అమ్మాయితో పెళ్లి జరిపించారు.మహబూబ్ నగర్ లో జరిగింది ఈ ఘటన.