ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను..లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

I spoke to the soul of NTR..Lakshmi Parvati sensational comments

0
126

ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెడుతున్నానని తెలిపారు.

జీవిత, రాజశేఖర్ లు తనను మద్రాస్ కు పిలిపించి, ఒక అమ్మాయితో మాట్లాడించారని… ఆ 16 ఏళ్ల అమ్మాయిలోకి ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించి తనతో మాట్లాడిందని తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మ తనతో ఎన్నో విషయాలను పంచుకుందని చెప్పారు. తాను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడు సేమ్ ఎన్టీఆర్ లాగే చేసింది..నన్ను ఏమని పిలుస్తారు అని అన్నాను లక్ష్మీ అని చెప్పిందంటూ లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. నా శరీరం విడిచిపెట్టాను. నా ఆత్మ ప్రజల దగ్గరే ఉందని చెప్పారని పేర్కొంది.

నేను తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా జన్మిస్తాను అని చెప్పారని… ఆ తమిళ్ అమ్మాయి చెప్పిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని బాంబ్‌ పేల్చింది.. ఆమె తెలుగు కూడా మాట్లాడుతుందని.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయులు ఎన్టీఆర్ అని లక్ష్మి పార్వతి కొనియాడారు.. కరోనా వల్ల అనేక మంది కి ఇబ్బందులు వస్తున్నాయి..కరోనా నుండి ప్రజలను రక్షించాలని ఆయన ఆత్మను కోరుతున్నాని లక్ష్మి పార్వతి పేర్కొన్నారు.