‘మెగా బెగ్గింగ్ చూసి హర్ట్ అయ్యా’..అందుకే పవన్ పాపులర్: ఆర్జీవీ

0
108

గత కొన్ని నెలలుగా ఏపీ టికెట్స్ రేట్స్ ఇష్యూ చర్చల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం తెలుగు బడా స్టార్స్ సీఎం జగన్‌ తో భేటీ అయి చర్చలు జరిపారు. ఏపీ సర్కార్, టాలీవుడ్‌కు మధ్య వార్‌కు శుభం కార్డు పడినట్లే అనిపిస్తుంది. పరస్పర ప్రయోజనాలు. అటు ఏపీకి ఉండాలి. ఇటు తెలుగు సినీ పరిశ్రమకూ ఉండాలన్న సారాంశం అటు సీఎం, ఇటు ఫిల్మ్ స్టార్స్ మాటలను బట్టి తెలుస్తోంది. రాబోయే 2 వారాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారిక ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉంది.

తాజాగా సినిమా టికెట్ రేట్ల ఇష్యూపై ఆర్జీవీ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గురువారం సీఎం జగన్‌తో సినీ పెద్దల మీటింగ్‌పై అర్థరాత్రి ట్వీట్స్ మోత మోగించారు. ఈ మీటింగ్ తాలూకు వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఆర్జీవీ.. చిరంజీవి టార్గెట్‌గా సెటైర్లు గుప్పించారు. ‘ఓ మెగా ఫ్యాన్‌గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధపడ్డా’ అని ట్వీట్ చేశారు.

అంతేకాదు చిరు తమ్ముడు పవన్ ఎప్పుడూ ఇలా బెగ్ చెయ్యడని.. అందుకే అతను ఎక్కువ పాపులర్‌ అంటూ మరో ట్వీట్‌లో రాసుకొచ్చారు. అందుకే ఈ తరహా విషయాల్లో మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఇష్టపడరంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే చిరంజీవిని ట్యాగ్ చేస్తూ.. ఆయనపై సెటైర్లు వేస్తూ వరస ట్వీట్లు వేసిన వర్మ..కొద్దిసేపటి తర్వాత తిరిగి వాటని రిమూవ్ చేయడంతో ఆయన తీరుపై జనాల్లో చర్చలు నడుస్తున్నాయి.