తెలంగాణ ప్రజలు పిలిచే వరకు రాను..పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

0
67

రంగారెడ్డి​ జిల్లా చేవెళ్లలో జనసైనికులనుద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. ఈ రాష్ట్ర ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్న పవన్​..వారి పోరాట స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పిలిచేవరకు రానని స్పష్టం చేశారు. తెలంగాణ నేలపై తనకున్న మమకారం ఊహించలేరన్నారు. భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు.

సామాజిక మార్పు జరగాలంటే..ఎంతో ప్రసవవేదన పడాలి. దేశానికి ఖనిజ గనులు, అరణ్యాలు, నదులు.. కాదు సంపద.. కలల ఖనిజాలతో చేసిన యువతే అసలు సంపద. అడుగు వేస్తే తప్ప.. అనుభవం రాదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గెలుస్తానా.. లేదా అనేది నేను ఆలోచించలేదు. కష్టాల్లో ఉన్న వాళ్లకు అండగా ఉండగలనా అనేది మాత్రమే ఆలోచించాను. రాజకీయాల్లోకి వస్తుంటే అందరూ నన్ను భయపెట్టారు.

ఏపీలో ఉన్న వైసీపీ నాయకులు నాకు శత్రువులు కాదు. ఇక్కడ కూడా నాకు ప్రత్యర్థులు ఎవరు లేరు. నన్ను ఎంత మంది తిట్టినా..వాళ్లేవరినీ శత్రువులుగా చూడను. వాళ్లందరినీ బలంగా ఎదుర్కుంటా. పార్టీ పెట్టి ఇన్ని ఏళ్లైంది. ఎందుకు రాలేదని చాలా మంది అడిగారు. తెలంగాణ ప్రజలు పిలిచేవారకు రాను. నాకు ప్రజల అనుమతి కావాలి. తెలంగాణ నేలపై నాకున్న మమకారం మీరు ఊహించలేరు.