నేనే స్పెషల్‌ అంబాసిడర్‌‌గా పనిచేస్తా..మంత్రి రోజా

0
89

ఇటీవలే ఏపీ పర్యాటక శాఖ, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రోజా కళాకారులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ ప్రోత్సహించేలా అన్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు నేను అహర్నిశలు శ్రమిస్తూ ప్రత్యేక అంబాసిడర్‌గా వర్క్ చేస్తానని తెలిపింది.

అంతేకాకుండా విదేశీ పర్యాటకులు పెద్దఎత్తున తరలి వచ్చేలా అన్ని చర్యలు చేపడుతానని తెలిపారు. ఇంకా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను నిత్యం సందర్శించడంతో పాటు అక్కడి సమస్యలను కూడా  తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని మంత్రి రోజా తెలిపారు. ఈ సందర్బంగా..సచివాలయంలో ఆమె ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దేశ, విదేశాల నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున పర్యాటకులు తరలి వచ్చేలా అవసరమైన వాయు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో క్రీడలు, క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకంటామని చెప్పారు. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనులు కూడా శరవేగంగా పూర్తి చేయాలనీ రోజా అధికారులకు తెలిపింది.