నేను అక్కడే ఉండి ఉంటే ఉరి తీసేవారు – ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

I would have been hanged if I had stayed in Afghanistan- Former President of Afghanistan Ashraf Ghani

0
113

ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి.ఆఫ్ఘనిస్థాన్ నుంచి రూ. 1,255 కోట్లతో పరారైనట్టు తజకిస్థాన్లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ఆరోపణలు చేశారు. దీనిని ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఖండించారు. ఆయన నాలుగు కార్లు హెలీకాఫ్టర్ నిండా నగదుతో పారిపోయిన్లు వార్తలు వచ్చాయి అవన్నీ అబద్దం అని తెలిపారు.

రక్తపాతం జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను కాబూల్ విడిచిపెట్టినట్టు చెప్పారు. తాను బూట్లు కూడా ధరించలేదని కేవలం చెప్పులతోనే అధ్యక్ష భవనాన్నీ వీడి వచ్చాను అని తెలిపారు. దుబాయ్ లోనే ప్రవాస జీవితం గడపాలని తనకు లేదని, స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నానని తెలిపారు.

అయితే మరో మాట అన్నారు తాను ఇంకా కాబూల్ లో ఉండి ఉంటే త‌న‌ని ఉరితీసేవారని అన్నారు. నేను కనుక అక్కడే ఉండి ఉంటే ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తనను ఆఫ్ఘన్ ప్రజల కళ్లముందే ఉరితీసేవారని ఘనీ తెలిపారు. తాలిబన్లు మొత్తం దేశం ఆక్రమించుకునేలోపు ఆయన అక్కడ నుంచి వచ్చేశారు. అయితే ఘనీ చేసిన పనిపై అన్నీ దేశాలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి.