ఎవడైనా అడ్డుకుంటే తొక్కి పడేస్తాం – జగ్గారెడ్డి

0
70

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణను పర్యటించాడానికి అన్ని సన్నాహాలు జరిగాయి. మే 6న రాహుల్ గాంధీ వరంగల్ భారీ బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో దీనిని విజయవంతం చేసేలా టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలనీ నిర్ణయించుకున్నారు.

అనంతరం మే 7 న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విద్యార్థులను కలవడానికి రానున్నారు. కానీ దీనిని ఎవరైనా అధికారులు, ప్రభుత్వ పెద్దలు, పోలిసులు కానీ అడ్డుకోవాలని చూస్తే తొక్కి పడేస్తాం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రాహుల్ గాంధీ వరంగల్ భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున జనాలు వచ్చేలా అన్ని సమీకరణాలు చేయాలనీ తెలిపారు. అందరు నాయకులూ కలసికట్టుగా పని చేసి ఈ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. వర్కింగ్ ప్రసిడెంట్ల్స్, వైస్ ప్రసిడెంట్స్ అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టడంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేయాలనీ వెల్లడించారు.