గ్యాస్ వినియోగదారులకి కంపెనీలు ఓ విషయాన్ని చెబుతున్నాయి, నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు, ఇక గ్యాస్ డెలివరీని డీఏసీ ద్వారా పంపుతారు, అంటే డెలివరీ అథంటికేషన్ కోడ్ అని అర్థం. మీరు ఇప్పుడు మొబైల్ లేదా యాప్ వెబ్ సైట్లో ఫోన్ లో బుక్ చేయగానే గ్యాస్ వచ్చేది. కాని ఇప్పుడు రూల్ మారుతోంది.
సేమ్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది కాని మీ మొబైల్ నంబర్ కు వచ్చే కోడ్, డెలివరీ సమయంలో కచ్చితంగా చెప్పాల్సిందే. అందుకే మీరు మీ గ్యాస్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వారికి సంబంధించిన మొబైల్ నెంబర్ ని చెక్ చేసుకోండి, దానికి మాత్రమే ఆ కోడ్ వస్తుంది.
ఒకవేళ అప్ డేట్ చేసుకోపోతే, వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అప్ డేట్ చేసుకోవచ్చు. మీరు ఏవైనా కారణాలతో ఇలా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్టర్ చేసుకోపోతే డెలివరీ బాయ్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు అప్పటికప్పుడు మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత కోడ్ వస్తుంది. ఇప్పటికే పలు పట్టణాల్లో అమలు చేస్తున్నారు ఈ రూల్.