ఆ ప్రకటన చేస్తే నేనే కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తా: కోమటిరెడ్డి

0
111

శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కీలక ప్రకటన చేయనున్నారు. నిరుద్యోగులు అంతా రేపు ఉదయం పది గంటల సమయంలో టీవీలు చూడాలని కోరారు కేసీఆర్. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఏం ప్రకటన చేయబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ అంశంపై ఎంపీ కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రేపు నిరుద్యోగుల కోసం ఉదయం 10.00 గంటలకు ప్రకటన చేస్తానని కేసీఆర్ అనడం సంతోషాన్ని కలిగించింది. రాష్ట్ర ప్రజలలో ఒకడిగా నేను రేపటి మీ ప్రకటన కోసం వేచి చూస్తున్నాను. 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు 3,116 ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నారు. 37 నెలల నిరుద్యోగుల బకాయిలు ఇస్తానని ప్రకటిస్తారని ఆశిస్తున్నా. ఖాళీగా ఉన్న లక్షా తొంభైవేల ఉద్యోగాలకు ఒకే దఫాలో నోటిఫికేషన్ ప్రకటిస్తారని అనుకుంటున్న. ఉపాధ్యాయుల,DSC నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక ఏజీ లిమిట్ అయిపోయిన వారి కోసం కూడా మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా అన్నారు.

అలాగే నిరుద్యోగుల ఆత్మహత్యలు మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ రావటానికి యువకులు, నిరుద్యోగులు ముఖ్య కారణం. మీరు ప్రకటించబోయే ప్రకటనలో ఈ ప్రధాన నిరుద్యోగ సమస్యలు ఉంటాని అనుకుంటున్న. మేము ఆశించినట్టు మీరు రేపు ప్రకటన చేస్తే నేనే మీ ఫొటోకు పాలాభిషేకం చేస్తానని కోమటిరెడ్డి అన్నారు.