రాహుల్ గాంధీ ఓయూ కు వస్తే కేసిఆర్ కు ఎందుకు భయం?

0
115

ఈనెల 7న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్‌ కాలేజీ వద్ద ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సభ నిర్వహించి విద్యార్థులను కలిసేలా టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విద్యార్థులతో చర్చించబోతున్నారని తెలిపారు.

కానీ రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకోవడంతో జగ్గారెడ్డి, విహెచ్ లు అనుమతి కోరారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. అయినా రాహుల్ గాంధీ ఓయూ కు వస్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు అని సూటిగా ప్రశ్నించాడు.

కేసీఆర్ ఓయూకు రాకుండా రాహుల్ ను అడ్డుకుంటున్నారంటే ప్రజలు అప్పుడే అతని మనస్తత్వం గురించి అర్ధం చేసుకోవాలని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసాడు. బానిసలు మాట్లాడే మాటలపై నేను మాట్లాడను. వారిని అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం చెప్పులతో కొట్టిన తప్పే లేదని వెల్లడించారు. రబ్బరు చెప్పులు లెనోడు కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడా అని మండిపడ్డారు.