మన దేశంలో ఎన్ని బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్ధలు వచ్చినా.. చాలా మంది పోస్టాఫీస్ ని బాగా నమ్ముతారు..వాటిలో నగదు డిపాజిట్లు స్కీమ్ లు చేస్తూ ఉంటారు, దీనిపై నమ్మకం విశ్వాసం ఎక్కువ.. అలాగే పిల్లల నుంచి వృద్దుల వరకూ అనేక స్కీమ్ లు ఉంటాయి… పోస్టల్ శాఖలో ఇప్పుడు ఎఫ్ డీలు ఫిక్సిడ్ డిపాజిట్లు కూడా భారీగా చేస్తున్నారు ప్రజలు, మంచి రాబడి వడ్డీ అలాగే ప్రభుత్వం హామీ ఉండటంతో ఇది ప్రజలకు భరోసాగా ఉంటోంది.
పోస్టాఫీస్లో ఎఫ్డీ చేస్తే మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. మీరు పోస్టల్ శాఖలో డిపాజిట్ చేయాలి అంటే మీకు ఖాతా ఉండాలి సదరు పోస్ట్ ఆఫీసులో, ఏడాది నుంచి ఐదేళ్ల కాల పరమితితో పోస్టాఫీస్లో ఎఫ్డీ అకౌంట్ తెరవొచ్చు. కనీసం రూ.1,000 నుంచి ఎఫ్డీ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
ఇక మీకు వడ్డీ అనేది 6.7 శాతం వస్తుంది. మంచి రాబడి అనే చెప్పాలి…ఎఫ్డీ అకౌంట్ తెరిచి రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే. మీకు అది ఐదు సంవత్సరాలు అయ్యే సరికి దాదాపు 3.8 లక్షలు ఇంట్రస్ట్ వస్తుంది, అంటే మొత్తం 13.8 లక్షలు మీ చేతికి వస్తుంది. ఇక రికరింగ్ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు. సో మంచి రాబడి రావాలి అంటే ఇది మంచి స్కీమ్.